రాష్ర్టంలో వేస్ట్ మేనేజ్ మెంట్ రంగంలో ఎకీకృత విధానాన్ని అనుసరించేందుకు కార్యాచరణ రూపొందించాలని పురపాలక శాఖాధికారులను మంత్రి కేటీ రామారావు అదేశించారు. ఈ రోజు రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న చెత్త నిర్వహణ ప్రాజెక్టులపైన సమీక్ష నిర్వహించారు. చెత్త నిర్వహణ అనేది కొంత ఖర్చుతో కూడుకున్న అంశం అయినప్పటికీ, స్వచ్చమైన నగరాల కోసం ప్రభుత్వం భాధ్యత ఎత్తుకుంటున్నదని తెలిపారు. అయితే ఇందుకోసం ఏకీకృత విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం అకాడమిక్ స్టాప్ కాలేజ్ (ఆస్కీ) సహకారంతో మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. చెత్త నిర్వహణలో భాగంగా హైదారాబాద్ నగరంలోని జవహార్ నగర్ ప్లాంట్ వద్ద ఉన్న వ్యర్థాలకు గ్రీన్ క్యాపింగ్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీని ద్వారా అక్కడ జలాలు కలుషితం అయ్యే అవకాశం తగ్గుతుందన్నారు. దీంతోపాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు దుర్వాసన పోతుందన్నారు. ఈ గ్రీన్ క్యాపింగ్ కోసం మెత్తం 146 కోట్లతో పనులు ప్రారంభం అవుతాయన్నారు. ఈ సంవత్సరంలో హరితహారంలో మెడిసినల్ మెక్కలు, సువాసనాలు వెదజల్లే చెట్లు నాటుతామని తెలిపారు. జవహార్ నగర్ డంప్ యార్డ్ వద్ద ఉన్న వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ చేస్తామని, దీని ద్వారా చెత్త నుంచి వచ్చే కలుషిత జలాలను అక్కడిక్కడే శుద్ది చేసేందుకు అవకాశం ఎర్పాడుతుందన్నారు.
రాష్ర్టంలోని అరు వేస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్టుల యాజమాన్యాలతో ఈరోజు సమావేశం అయిన మంత్రి వాటిని పునరుద్దరణ చేసే అవకాశాలను తెలుసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలోని నాలుగు వేస్ట్ టూ ఏనర్జీ కంపెనీల ప్రతిపాదనలు ఏంటని, ఏప్పటిలోగా ప్రారంభం అవుతుందనే అంశాలను తెలుసుకున్నారు. మెత్తంగా రెండు కంపెనీలు వేస్ట్ టూ ఏనర్జీ ప్లాంట్ ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. దీంతోపాటు కరీంనగర్, సూర్యపేట జిల్లాలో ఉన్న కంపెనీలు మూసివేతకు దారి తీసిన కారణాలు, వాటి పున: ప్రారంభానికి ఉన్న అవకాశాలను వాటి యాజమాన్యాలతో మాట్లాడారు. ప్రభుత్వ పరంగా కాంట్రాక్టు ఒప్పందంలో పెర్కోన్న నిబంధనలకు తాము కట్టుబడి ఉంటామని, అమేరకు అయా ప్లాంట్లకు చెత్తను సరఫరా చేస్తామన్నారు.
ఈ సమావేశంలో హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, నగర కమీషనర్ జనార్ధన్ రెడ్డి, ఆస్కీ ప్రతినిధులు, పురపాలక శాఖాధికారులు పాల్గోన్నారు.