ఢిల్లీ హైకోర్టుకు కృతి సనన్

9
- Advertisement -

బాలీవుడ్ నటి కృతి సనన్ తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశానికి సంబంధించిన గత తీర్పులు, పరిశోధన పత్రాలను సమర్పించాలని ఆమె తరఫు న్యాయవాదిని కోరింది. తదుపరి విచారణను అక్టోబర్ 29కి వాయిదా వేసింది.

జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్ ఈ కేసును విచారించారు. వ్యక్తిగత హక్కుల పరిధి, వాటికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను స్పష్టంగా వివరించేందుకు సంబంధిత తీర్పులు, పరిశోధన సమాచారంతో కూడిన పత్రాలను సమర్పించాలని కృతి సనన్ తరఫు న్యాయవాది ప్రవీణ్ ఆనంద్‌ను ఆదేశించారు.

విచారణ సందర్భంగా వ్యక్తిగత హక్కుల పరిధిలోకి వచ్చే అంశాల గురించి న్యాయస్థానం ప్రశ్నించింది. దీనికి సమాధానంగా న్యాయవాది.. ఒక వ్యక్తి గొంతు, ముఖం, రూపం, ఫొటోలు, ముఖం కనిపించే వీడియోలు, పేరు వంటి అంశాలు ఈ హక్కుల పరిధిలోకి వస్తాయని వివరించారు. సంబంధిత వ్యక్తి అనుమతి లేకుండా వారి రూపాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించి డబ్బు సంపాదించడం కూడా ఈ హక్కులకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు.

Also Read:T20:విండీస్‌కు పూర్వవైభవం వచ్చేనా?

ఢిల్లీ హైకోర్టు గతంలో పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారుల వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించింది. నటి కంగనా రనౌత్, టబు, నటుడు విజయ్ దేవరకొండ, క్రికెటర్లు అభిషేక్ శర్మ, యువరాజ్ సింగ్‌తో పాటు అల్లు అర్జున్, మోహన్‌లాల్, జుబిన్ నౌటియాల్, సునీల్ గవాస్కర్, కాజోల్, ఆర్. మాధవన్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులకు సంబంధించిన కేసుల్లోనూ కోర్టు రక్షణ కల్పించినట్లు నివేదిక పేర్కొంది.

- Advertisement -