SSR రివర్స్ చేస్తే RSS!

7
- Advertisement -

ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్…. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితాల సవరణ పేరుతో రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ నేరుగా ఎన్నికల్లో గెలవలేక….ఎన్నికల సంఘం ద్వారా కుట్రలు పన్నుతోందని వ్యాఖ్యానించారు.

ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ (SSR) అంశంపై స్పందించిన అఖిలేశ్ యాదవ్.. SSRను రివర్స్ చేస్తే ‘RSS’ వస్తుందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియకు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)కు సంబంధం ఉందనే భావనను వ్యక్తం చేస్తూ బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు.

ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో పారదర్శకత ఉండాలని….అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి. ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాలపై వివాదాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

Also Read:మార్కో రూబియో టూర్‌పై రాహుల్

- Advertisement -