రామాయణం..నయా ట్రైలర్!

1
- Advertisement -

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక పౌరాణిక చిత్రం ‘రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’. ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ట్రైలర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఈ విజువల్ గ్రాండియర్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లోని విజువల్స్, పాత్రల రూపకల్పన సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

Also Read:కాంగ్రెస్ అరాచకం..రాజ్‌నాథ్ ఫైర్

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తుండగా, రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడి పాత్రను పోషిస్తున్నారు. ప్రధాన పాత్రల్లో ఈ ముగ్గురు ప్రముఖ నటులు కనిపించనుండటంతో సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.మొదటి భాగం నవంబర్ 5, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

- Advertisement -