సినిమా, టీవీ ఇలా ఇండస్ట్రీ ఏదైనా కానీ ప్రతి నటి ఏదొక దశలో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటుంది. ఆ అందాల వెనుక అనేక రంగులు ఉంటాయి. ఆ రంగుల మధ్యలో అనేక ఆపదలు తలెత్తుతుంటాయ్. వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది క్యాస్టింగ్ కౌచ్. ఆ క్యాస్టింగ్ కౌచ్ సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఉంది. తాజాగా ఇద్దరు స్టార్ హీరోయిన్లు కూడా తమకు ఎదురైనా చేదు అనుభవాలను వివరించారు. మొదట కృతి సనన్ తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
మోడలింగ్ పై ఆసక్తితో దిల్లీ నుంచి ముంబయి వచ్చిన మొదట్లో అవకాశాల కోసం చాలా అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపింది. ఓ ర్యాంప్ షోలో కొరియోగ్రాఫర్ తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించి అందరి ముందు అవమానించాడని తెలిపింది. ఆ బాధతో మోడలింగ్ వదిలేద్దామనుకున్నట్లు వివరించింది. తన తల్లి ఇచ్చిన ధైర్యం తోనే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని కృతి చెబుతోంది. అలాగే మరో హీరోయిన్ హన్సిక కూడా నోరు విప్పింది.
Also Read:డిజిటల్ డిటాక్స్ అంటే ఏంటో తెలుసా?
హన్సిక తన కెరీర్ తొలినాళ్లల్లో పడ్డ కష్టాలను పంచుకుంది. ఒకప్పుడు తనను చులకనగా చూసిన వారే ఇప్పుడు బతిమిలాడుతున్నారని చెప్పింది. ‘‘సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కొందరు మేనేజర్లు నాతో తప్పుగా ప్రవర్తించారు. ఆ రోజుల్లో నాకు డ్రెస్‌లు డిజైన్ చేయమని అడిగితే ఎవరూ స్పందించేవారు కాదు. మరికొందరు ఏకంగా చేసేదిలేదని చెప్పే వాళ్లు. స్టార్ హీరోయిన్ అయ్యాక వాళ్లే నా దగ్గరకు వచ్చి ‘ఒక్కసారి మేము చేసిన డ్రెస్ వేసుకోండి’ అని బతిమిలాడుతున్నారు’ అని చెప్పింది.