మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన భామ కృతి సనన్. తర్వాత బాలీవుడ్ లో వరుస సక్సెస్ లు రావడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బ్యూటీ సీక్రెట్ గురించి వెల్లడించింది కృతి.
తన మెయిన్ బ్యూటీ సీక్రెట్ మంచినీళ్లు. మా అమ్మ చెప్పిన సీక్రెట్ అది. చిన్నప్పుడు ఆటల్లో ఉన్నా, చదువులో ఉన్నా మాటి మాటికీ మంచినీళ్లు తాగించేది. అప్పుడు మా అమ్మ వల్ల అయిన అలవాటు ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. మంచినీళ్లు శరీరాన్ని తేమగా ఉంచడమే కాకుండా లోపలున్న టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తాయన్నారు.
చాలా మంది నీళ్లు తాగడాన్ని అశ్రద్ధ చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నవాళ్లు మంచినీళ్లను ఎక్కువగా తాగుతారు. మంచినీళ్లతో పాటు నేను ప్రతిరోజూ తాజా కూరగాయల రసం కూడా తాగుతాను అని వెల్లడించింది. ప్రస్తుతం ప్రభాస్‌తో ఆది పురుష్ సినిమాలో నటిస్తోంది కృతి.