క్రిష్ దర్శకత్వంలో పవన్‌..!

329
pawan krish

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ వెండితెరపై అలరించనున్నాడా…?సినిమాలకు ప్యాకప్ చెప్పిన పవన్ మళ్లీ  మొఖానికి  మేకప్ వేసుకోనున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొంతకాలంగా పవన్ సినిమాల్లోకి వస్తారని వార్తలు వస్తున్న అవీ రూమర్లుగానే మిగిలిపోయాయి. కానీ టీ టౌన్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం పవన్ మనసు మార్చుకుని సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

గమ్యం, వేదం, కృష్ణ‌మ్ వందే జ‌గ‌ద్గుర‌మ్, కంచె,గౌతమిపుత్ర శాతకర్ణి వంటి డిఫ‌రెంట్ సినిమాల‌ను తెరకెక్కించిన క్రిష్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యాడట పవన్‌. క్రిష్ చెప్పిన స్టోరీ నచ్చడంతో పవన్ ఓకే చెప్పినట్లు సమాచారం. అన్నీ అనుకున‌ట్లు జరిగితే ప‌వ‌న్‌, క్రిష్ సినిమాకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.