కంటోన్మెంట్ భూములు దుర్వినియోగం: ఎంపీ ప్రభాకర్ రెడ్డి

564
kotha prabhakar reddy
- Advertisement -

గత 30, 40 సంవత్సరాలలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం దుర్వినియోగం అవుతోందన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. లోక్ సభలో జీరో అవర్‌లో మాట్లాడిన ప్రభాకర్ రెడ్డి..అధీకృత, అనధికార యజమానులు ఎలాంటి అనుమతి లేకుండా రక్షణ భూములను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు.

విలాసవంతమైన వివాహ ఫంక్షన్ హాల్స్, విద్యాసంస్థలు, ధాబాస్, వెహికల్ షో రూములు, పెద్ద గోడౌన్లు, వాణిజ్య భవనాలను అనాధికారంగా నిర్మించారని…ప్రభుత్వానికి ఆదాయ రూపంలో ఒక్క పైసా కూడా రావడం లేదన్నారు.

ప్రస్తుతం ఉన్న లీజు అద్దె ఒప్పందాలను మార్చాలని చెప్పిన ప్రభాకర్ రెడ్డి…సాధారణ ప్రజల సంక్షేమం కోసం స్కైవేలు మరియు ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణానికి రక్షణ భూములను తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించాలన్నారు. ఇదే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసిందని తెలిపారు.

Medak MP kotha prabhakar reddy speech at Lok Sabha….Medak MP kotha prabhakar reddy speech at Lok Sabha….

- Advertisement -