షాక్.. కొరటాల అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం..

207
koratala siva
- Advertisement -

టాలీవుడ్‌ టాప్ డైరెక్టర్‌ కొరటాల శివ దగ్గర కొన్ని రోజులుగా అసిస్టెంట్ రైటర్‌గా పని చేస్తున్న మహేష్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇతడిది అనంతపురం జిల్లా మడకశిర మండలం చీపులేటి గ్రామం. తన అన్నను ఈ నెల 8వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారని… కర్ణాటక నుంచి అక్రమ మద్యం తీసుకొస్తున్నాడని ఇంటికి వచ్చి దారుణంగా ప్రవర్తించారని మహేష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు వ్యవహరించిన తీరుతో తన పెళ్లి ఆగిపోయిందంటూ మడకశిర పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు.

- Advertisement -