టాస్ గెలిచి బౌలింగ్ ఎంచున్న చెన్నై..

154
csk

ఐపీఎల్‌ 2020 13వ సీజన్‌లో భాగంగా ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ పోరులో టాస్ గెలిచిన చెన్నై జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ పై విజయం సాధించిన చెన్నై జట్టు అదే ఊపును కొనసాగించాలని భావిస్తోంది. యూఏఈ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తన రెండో మ్యాచ్ కు సిద్ధమైంది.

ఇక, స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడుతోంది. ఆ జట్టులో అందరి కళ్లు ఇంగ్లాండ్ స్పీడ్ స్టర్ జోఫ్రా ఆర్చర్ పై ఉంటాయనడంలో సందేహంలేదు. తిరుగులేని పేస్ తో ఫార్మాట్ ఏదైనా బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తిస్తున్న ఈ క్విక్ బౌలర్ రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక ఆటగాడు.

రాజస్థాన్ రాయల్స్ జట్టు: యశస్వి జైస్వాల్, రాబిన్ ఉతప్ప, సంజు సామ్సన్ (wc), స్టీవెన్ స్మిత్ (c), డేవిడ్ మిల్లెర్, రియాన్ పరాగ్, శ్రేయాస్ గోపాల్, టామ్ కుర్రాన్, రాహుల్ టెవాటియా, జోఫ్రా ఆర్చర్, జయదేవ్ ఉనద్కట్

చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు: మురళీ విజయ్, షేన్ వాట్సన్, ఫాఫ్ డు ప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, ఎంఎస్ ధోని (w / c), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, లుంగీ ఎన్గిడి