ఈటల వ్యాఖ్యలు బాధాకరం: వినోద్ కుమార్

20
b vinod kumar

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో తెలంగాణ సమాజం సంతోషంగా లేరు… తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్రం ఒక్కటే మార్గం అన్నవాళ్ళలో నేను ఒకన్నీ అన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్. ఆనాడు చంద్రబాబు నాయుడు టీఆర్‌ఎస్‌ పార్టీని చాలా ఇబ్బంది పెట్టాడు…2001లోనే టీఆర్‌ఎస్‌ పార్టీ కమలాపూర్ నియోజవర్గంలో బలంగా ఉంన్నారు.

ఈటెల పార్టీ లో చేరక ముందే కమలా పూర్ లో అన్ని జడ్పీటీసీ ,ఎంపీపీ లను టీ ఆర్ ఎస్ గెలిచిందన్నారు. ఈటెలకు 2003 లో కమలా పూర్ నియోజకవర్గాన్ని బంగారు పల్లెం లో పెట్టి ఇచ్చాము,,,* 2001లోనే ఉత్తర తెలంగాణ లో టీఆరెస్ పార్టీ బలంగా ఉంన్నారు.కరీం నగర్ జడ్పి సీటు ను కైవసం చేసుకున్నాం … ఈటెల కు ఫ్లోర్ లీడర్ ఇచ్చి అత్యున్నత స్థానం కేసీఆర్ కల్పించారన్నారు.

ఈటెలకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన కేసీఆర్ కు సవాల్ చేస్తున్నారా?.. రాజకీయాల్లో ఉంటూ ప్రభుత్వ భూముల జోలికి పోవద్దన్నారు. హుజురాబాద్ కి ఏం కావాలంటే అది ముఖ్యమంత్రి ఇచ్చారు….రైతు బంధు పథకాన్ని సీఎం కెసిఆర్ ఈటల మీద ప్రేమ తోనే ఆయన నియోజకవర్గం లో ప్రారంభించారన్నారు. అపుడు రైతు బందును పొగిడి ఇపుడు విమర్శిస్తావా ?….దేశం యావత్ తెలంగాణ పథకాల వైపు చూస్తున్నపుడు వాటిని ఈటెల విమర్శించడం సబబా ? అని ప్రశ్నించారు. ఈటల మాటలు చూసి బాధేసిందన్నారు.