ఒరిజినల్ డాక్యుమెంట్ ..‘కూసే మునస్వామి వీరప్పన్’

60
- Advertisement -

పలు భాషల్లో వైవిధ్యమైన కంటెంట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ మన దేశంలోనే అతి పెద్దదైన ఓటీటీ మాధ్యమంగా రాణిస్తోంది ZEE5. తాజాగా ఇందులో మరో కొత్త ఒరిజినల్ చేరింది. అదే తమిళ్ ఒరిజినల్ సిరీస్ ‘కూసే మునస్వామి వీరప్పన్’. ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అడవుల్లోకి పారిపోయి తలదాచుకున్న బందిపోటు దొంగ కూసే మునస్వామి వీరప్పన్ జీవితానికి సంబంధించి లోతైన అధ్యయనం చేసి ఈ ఒరిజినల్‌ను రూపొందించారు. ఈ క్రమంలో సదరు బందిపోటు దొంగకు సన్నిహితులైన వారి నుంచి వివరాలను సేకరించారు. అదేవిధంగా ఆయన్ని పట్టుకోవటానికి ప్రయత్నించిన అధికారుల నుంచి సేకరించిన వీడియోను కూడా పొందుపరిచారు. ఇది వీరప్పన్ యొక్క రహస్య జీవితాన్ని, అతని నేర వారసత్వాన్ని స్పష్టంగా ఆవిష్కరించింది. ఈ సిరీస్ ముందు వీరప్పన్ నెరేషన్‌తో ప్రారంభమవుతుంది. అతని పూర్తి జీవితాన్ని ఆవిష్కరిస్తూనే అతని చుట్టూ జరిగిన ఘటనలను గురించి కూడా తెలియజేస్తుంది. కూసే మునస్వామి వీరప్పన్ ఒరిజినల్‌ను తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ZEE5 ఎక్స్‌క్లూజివ్‌గా డిసెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది.

వీరప్పన్‌ను పట్టుకోవటానికి మూడు దశాబ్దాల పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక అడవుల్లో పోలీసులు అన్వేషించారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో నాటకీయంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) టీమ్ చేసిన ఎన్‌కౌంటర్‌లో వీరప్పన్ మరణించారు. పోలీసుల రికార్డుల్లో, చరిత్రలో తన చరిత్ర ఓ భాగంగా మాత్రమే మారింది. ఇందులో వీరప్పన్ స్వయంగా నెరేషన్ ఇచ్చారు. ఇదొక తమిళ కథనం. దీంతో కూసే మునస్వామి వీరప్పన్‌పై ప్రేక్షకులకు ఓ ప్రత్యేకమైన దృక్పథం ఏర్పడుతుంది.

Also Read:Bigg Boss 7 Telugu:అమర్‌కి దెబ్బేసిన శివాజీ

- Advertisement -