Bigg Boss 7 Telugu:అమర్‌కి దెబ్బేసిన శివాజీ

46
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 82 రోజులు పూర్తి చేసుకుంది. ఇక 12వ వారం నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా సాగింది.ఇక తనకు ఛాన్స్ వస్తే అమర్‌ని కెప్టెన్ చేస్తానని చెప్పిన శివాజీ…తీరా ఆ టైం వచ్చే సరికి ప్లేట్ ఫిరాయించాడు. కెప్టెన్సీ టాస్క్ కోసం అర్జున్, అమర్ ఇద్దరి ఫొటోలు పెట్టి.. మరో ఇద్దరిని నిల్చోబెట్టి.. వారిద్దరూ ఏకాభిప్రాయంతో ఒకరిని కెప్టెన్సీ రేసు నుంచి తీసేయాలని ట్విస్ట్ ఇచ్చాడు. ఇదే ఈ సీజన్ ఆఖరి కెప్టెన్సీ అంటూ బిగ్‌బాస్ ప్రకటించాడు.

దీనికోసం పెద్ద టాస్క్ పెట్టారు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో ఓ పెద్ద మిషెన్ గన్ పెట్టారు. గన్ సౌండ్ వచ్చినప్పుడు ఏ ఇద్దరు ముందుగా వచ్చి దాని దగ్గర నిలబడతారో వాళ్లు.. ఎందురుగా ఉన్న గోడపై వచ్చిన ఇద్దరి ఫొటోల్లో ఒకరిని తప్పించడానికి ఏకాభిప్రాయానికి రావాలి. ఎవరి ఫొటోను అయితే వాళ్లు కాల్చేస్తారో వాళ్లు కెప్టెన్సీ రేసు నుంచి ఔట్ అయిపోతారు. ఇలా రెండు సార్లు మాత్రమే మిషన్ గన్ దగ్గరకి కంటెస్టెంట్లు రావాలి. ఇక ఇది అనౌన్స్ చేయగానే అమర్‌దీప్ శివాజీ దగ్గరికెళ్లి తనని సపోర్ట్ చేయాలని కోరాడు. రిక్వెస్ట్ చేస్తున్నా అన్నా ప్లీజ్.. లాస్ట్ కెప్టెన్ అన్నా.. మీరందరూ అయ్యారుగా అంటూ ప్రాధేయపడ్డాడు. దీంతో పోనీ చేద్దాం.. నాకు వాడు సపోర్ట్ చేశాడురా లాస్ట్ టైమ్.. కుర్రతనంతో కొన్ని వెకిలి వేషాలు వేస్తాడు గానీ మాట ఇచ్చినం కదా.. పానం పోయినా మాట పోకూడదు కదా.. అంటూ యావర్, ప్రశాంత్‌లతో చర్చించి అమర్‌కి అభయం ఇచ్చాడు శివాజీ. రేయ్ మాటిచ్చినా.. మాట కోసం చచ్చిపోతా పో.. నువ్వే కెప్టెన్ అని శివాజీ అన్నాడు.

ఇక ఫస్ట్ గన్ సౌండ్ రాగానే ప్రియాంక-గౌతమ్ ఇద్దరూ స్పాట్‌కి వచ్చారు. ఇక గోడ మీద తెర తీసేసరికి శోభా శెట్టి-అర్జున్ ఫొటోలు ఉన్నాయి. ఇక మొదటిగా గౌతమ్ తన అభిప్రాయం చెప్పాడు. ఇద్దరిలో కంపేర్ చేస్తే అర్జున్ ఫెయిర్ గేమ్ ఆడాడు.. కానీ నువ్వు లాస్ట్ వీక్ ప్రియాంకను కెప్టెన్ కాకుండా కొట్టమని నాకు చెప్పావ్.. అంటూ గౌతమ్ అన్నాడు. దీనికి శోభా ఒప్పుకోలేదు. ఇక ప్రియాంక మాత్రం.. అర్జున్ కెప్టెన్‌గా ప్రూ చేసుకున్నాడు.. కానీ శోభా ఇంకోసారి ప్రూ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నానని చెప్పింది. శోభా ఫొటోని కాల్చేసి రేసు నుంచి తప్పించేశారు.

ఇక తర్వాత శోభా-ప్రశాంత్‌లకి అవకాశం వచ్చింది. ఇక అమర్-అశ్వినిలలో ఒకరిని తప్పించాల్సి వచ్చింది. తర్వాత యావర్-రతికలు గన్ దగ్గరికి వచ్చి నిల్చున్నారు. తీరా చూస్తే శివాజీ-ప్రశాంత్‌ల ఫొటోలు ఉండగా ప్రశాంత్‌ని తప్పించారు. అర్జున్- యావర్ ఫొటోలు రాగా డెసిషన్ తీసుకునే అవకాశం శివాజీ-అశ్వినీలకి దక్కింది. యావర్ స్వయంగా వచ్చి నా ఫొటో కాల్చేయండి ..అర్జున్ అన్న భార్య నాకు వదిన కాబట్టి నేను వదిలేస్తున్నా అంటూ చెప్పాడు. దీంతో లవ్ యూ రా అంటూ యావర్‌కి ముద్దు పెట్టాడు శివాజీ. తర్వాత శివాజీ-అర్జున్ ఫొటోలు రాగా గౌతమ్-అమర్ కలిసి శివాజీని తప్పించేశారు. చివరికి అర్జున్-అమర్ కెప్టెన్సీ ఫైనల్ రేసులో నిలబడ్డారు.

ఇక కెప్టెన్సీ కోసం అమర్ – అర్జున్ చేయని ప్రయత్నాలు లేవు. అనేక తర్జనభర్జనల అనంతరం ఎవరు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో బిగ్ బాస్ చివరకు విసుగెత్తి కెప్టెన్సీని రద్దు చేస్తున్నాం అని ప్రకటించాడు. దీంతో కంగారుగా వచ్చాం ఒక డెసిషన్‌కి అంటూ అర్జున్ ఫొటోని కాల్చారు శివాజీ-శోభా. కానీ అప్పటికే బిగ్‌బాస్ నిర్ణయం తీసేసుకున్నాడు కాబట్టి అర్జున్ ఫొటోతో పాటు అమర్‌ది కూడా కాలిపోయింది. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్లు అంతా అయ్యాక చివరగా అమర్‌కి శివాజీ సపోర్ట్ చేశాడు.. కానీ దాని వల్ల ఏం ఉపయోగం లేకుండా పోయింది. దీంతో కెప్టెన్ అయ్యే అవకాశం అమర్‌కి దక్కకుండా పోయింది.

Also Read:రైతుబంధుకు గ్రీన్ సిగ్నల్

- Advertisement -