వర్మ న్యూక్లీయర్‌ కోసం 340 కోట్లు…

241
- Advertisement -

వివాదలకు కేరాఫ్‌గా నిలుస్తాడు రామ్ గోపాల్ వర్మ.ఆయన సినిమా ఎప్పుడు మొదలుపెడతాడో ఎప్పుడు కంప్లీట్‌ చేస్తాడో ఎవరికి తెలియదు.సడన్‌గా సినిమా రీలీజ్‌ అని చెప్పేస్తాడు. మరి వర్మ అర్ధరాత్రి వేళ అదో లోకంలో ఉంటుంటాడు. అప్పుడు ఆయనకు చాలా ఐడియాలొస్తాయి. ఆ ఐడియాలతో సినిమాలు తీసేయడానికి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడూ కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తుంటాడు. కానీ తర్వాత వాటి గురించి మరిచిపోతుంటాడు. అలా ఆలోచనల దశలోనే ఆగిపోయిన వర్మ సినిమాలు చాలానే ఉన్నాయట.అయితే గత కొద్దికాలం క్రితం న్యూక్లియర్‌ అనే సినిమా తీయబోతున్నట్లు తెలిసింది.

RGV Goes International Movie with Rs 340

ఐతే ఈ ‘న్యూక్లియర్’ సినిమా ఆ కోవలోకి రాదనే అనుకున్నారంతా ఎందుకంటే ఈ ప్రాజెక్టు గురించి అనౌన్స్ చేసింది వర్మ కాదు. ఓ అంతర్జాతీయ నిర్మాణ సంస్థ. మరి ఈ సినిమాని రూ.340 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని ప్రణాళిక వేసుకుందట ఆ సంస్థ.అయితే ఆ సంస్థ వర్మ ట్రాక్ రికార్డు గురించి పట్టించుకోకుండా ఈ మెగా ప్రాజెక్టుకు ఆయన్నే దర్శకుడిగా ఎంచుకుని ఆశ్చర్యపరిచింది. ఆ ప్రొడక్షన్ హౌజ్‌తో ఈ సినిమా గురించి అనౌన్స్ మెంట్ వచ్చి ఆరు నెలలు దాటుతోంది. ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు.

ఈ భారీ బడ్జెట్‌ సినిమా ఎప్పుడు మొదలవుతుందో.. ఎప్పుడు పూర్తవుతుందో.. ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేదు. ఫస్ట్ అనౌన్స్ మెంట్ తర్వాత వర్మ కూడా దీని గురించి ఎప్పుడూ ప్రస్తావించింది లేదు. ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసే నాటికి.. ఇప్పటికి వర్మ స్థాయి మరింత పడిపోయింది. ‘వీరప్పన్’ హిందీ వెర్షన్ తో పాటు తెలుగులో ‘వంగవీటి’ కూడా ఫ్లాపయ్యాయి. ఇక ‘సర్కార్-3’ సంగతేంటో తేలాల్సి ఉంది. అది కూడా ఫ్లాపైతే వర్మ మీద ఏ నమ్మకంతో రూ.340 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తారో చూడాలి. అసలింతకీ ‘న్యూక్లియర్’ అనేది సీరియస్ ప్రాజెక్టేనా.. లేక వర్మ చేసిన తమాషానా అన్న సందేహాలు కూడా లేకపోలేదు జనాల్లో. మరి దీని గురించి తర్వాతి అప్ డేట్ ఎప్పుడిస్తారో చూడాలి.

- Advertisement -