నల్గొండ ఎమ్మెల్సీ బరిలో కోమటిరెడ్డి భార్య?

794
Komati Reddy Lakshmi
- Advertisement -

స్ధానిక సంస్దల ఎన్నికల నామినేషన్లకు సమయం దగ్గర పడుతుండటంతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్దులను ప్రకటించారు గులాబీ బాస్. వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండకు తేరా చిన్నపరెడ్డి, రంగారెడ్డి జిల్లాకు మాజీ మంత్రి పట్నం మహేందరెడ్డి పేర్లను ఖరారు చేశారు. నిన్న సాయంత్రం ప్రగతి భవన్ లో వారికి భీ ఫారమ్ లను కూడా అందజేశారు. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. నల్గొండ నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది.

ఈవిషయంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందించకపోయినా ఆమె పేరునే ఫైనల్ చేసినట్టుగా కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు నల్గొండ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి. ఈ ఇద్దరిలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి. ఇక వరంగల్ నుంచి కొండ సురేఖ పోటీ చేస్తుందని ప్రచారం జరగగా..పోటీ చేసేందుకు తాను సిద్దంగా లేనట్టు ప్రకటించినట్లు తెలుస్తుంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఇవాళ సాయంత్రంలోపు కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్దుల్ని ప్రకటించనన్నారు.

- Advertisement -