కొండంత అండ ఇదేనా..షాక్ లో కాంగ్రెస్…..?

447
konda murali
- Advertisement -

స్ధానికసంస్థల కోటాలో శాసనమండలి ఎమ్మెల్సీ స్ధానాలకు నామినేషన్లు ఈ నెల 14న ముగియనున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేయగా కాంగ్రెస్ మాత్రం అభ్యర్థులు దొరక్క,సీనియర్ లీడర్లు పోటీకి విముఖత చూపిస్తుంటంతో ఏంచేయాలో పాలుపోని స్ధితిలో ఉంది.

ఇక వరంగల్ నుండి మాజీ ఎమ్మెల్సీని కొండా మురళిని రంగంలోకి దించేందుకు ప్రయత్నం చేసిన ఆయన నో చెప్పినట్లు తెలుస్తోంది. వరంగల్ రాజకీయాల్లో కొండా మురళి ప్రత్యేకతే వేరు. ఎన్నికలు ఏవైనా తనదైన మార్క్‌ చూపించే కొండా టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఈ స్ధానం నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వేరు.

గులాబీ జోరులో హస్తం కుదలైంది. రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉండటంతో ఈసారి పోటీకి కొండా విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే 2018లో జరిగిన ఎన్నికల్లో తమ కంచుకోట పరకాలలో కొండా సురేఖ భారీ మెజార్టీతో ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో కొంతకాలం సైలెంట్‌ ఉండటమే మేలని భావిస్తున్న కొండా మురళి ఇదే విషయాన్ని తన అనుచరులతో పాటు పార్టీ నేతలకు తెలియజేశాడట. దీంతో షాక్‌కు గురైన కాంగ్రెస్‌ నేతలు వేరే అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టింది.

ఎమ్మెల్సీగా నాయిని రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పరకాల ఇంచార్జీ వెంకట్రామిరెడ్డి పేరు పరిశీలిస్తుండగా రాజేందర్ రెడ్డి పోటీకి విముఖత చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్ద‌లు వెంక‌ట‌రామిరెడ్డిని ఫైన‌ల్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా కొండా మురళి పోటీకి విముఖత చూపడంపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -