ఐపిఎల్ 12సీజన్ లో భాగంగా నిన్న కోల్ కత్తా వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్యలో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా విజయం సాధించింది. నిన్నటి విజయంతో కొల్ కత్తా ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కత్తా నిర్ణిత 20ఓవర్లలో 2వికెట్ల నష్టానికి 233పరుగులు చేసి భారీ స్కొరును నమోదు చేసింది. కోల్ కత్తా ఓపెనర్లు అద్భుతమైన శుభారంభాన్ని అందించారు. . తొలి వికెట్‌కి ఓపెనర్లు క్రిస్ లిన్, శుభ్‌మాన్ గిల్ కలిసి 96 పరుగులు చేశారు. ఆ తర్వాత వచ్చిన శుభ్ మాన్ గిల్ చెలరేగిపోయాడు.
45బంతుల్లో 76పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత గ్రీస్ లోకి వచ్చిన వెస్టిండిస్ ఆటగాడు రస్సెల్ కూడా తన సత్తాను చాటాడు. ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. 40బంతుల్లో 80పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ముంబై బౌలర్లు రాహుల్ చాహర్, హార్ధిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు. ఇక భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ముంబై 198పరుగులు మాత్రమే చేయగలిగింది.
ముంబై ఓపెనర్లు డికాక్ డకౌట్ కాగా, రోహిత్ శర్మ 12పరుగులు చేసి అవుట్ అయ్యాడు. లూయిస్ 15 పరుగులు చేయగా, సూర్య కుమార్ 26పరుగులు చేశాడు. ముంబై బ్యాట్స్ మెన్లందరూ పెవిలియన్ కు చేరుతుండటంతో హార్ధిక్ పాండ్యా కొద్ది సేపు కోల్ కత్తా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 34బంతుల్లో 91పరుగులు చేసి అవుట్ అయ్యాడు. హార్ధిక్ పాండ్యా అవుట్ కావడంతో కోల్ కత్తా గెలుపు లాంభనమైంది. కీలకమైన మ్యాచ్ లో కోల్ కత్తా గెలవడంతో ప్లే ఆఫ్స్ రేసులో చోటు దక్కించుకుంది.