షమీకి షాక్‌..!

68
- Advertisement -

భారత పేసర్ మహమ్మద్ షమీకి షాక్ తగిలింది. ఇటీవలె షమీ విడాకులు తీసుకోగా తన భార్యకు ప్రతి నెలా భరణం కిందా రూ.1.30 లక్షలు చెల్లించాలని కోల్ కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో రూ.50వేలు హసీన్‌కు కాగా, మరో రూ.80వేలు కుమార్తె బాగోగుల కోసం చెల్లించాలని తెలిపింది.

2014లో షమీ-హసీన్‌ వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. అయితే ఈ దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2018లో షమీపై హసీన్‌ గృహ హింస, దాడి, వరకట్న వేధింపులు వంటి ఆరోపణలు చేస్తూ కోర్టును ఆశ్రయించింది. దీంతో షమీపై దాడి, హత్యాయత్నం, గృహహింస తదితర అభియోగాలపై కేసు నమోదైంది.

తన కుమార్తె పోషణకు గానూ నెలకు రూ.10 లక్షలు అందించేలా చూడాలని డిమాండ్ చేయగా కోర్టు రూ.1.30 చెల్లించాలని తెలిపింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -