పెద్దపల్లిలో మొక్కలు నాటిన కోలేటి దామోదర్..

160
koleti
- Advertisement -

పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం రేగడి మద్ది కుంట గ్రామ శివారులో మొక్కలు నాటారు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌ ఛైర్మన్ కోలేటి దామోదర్. పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం దేశానికే స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో రామగుండం పోలీస్‌ కమిషన్‌ సత్యనారాయణ,పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, డీసీపీ రవీందర్ పాల్గొన్నారు.

- Advertisement -