కమల్…విక్రమ్‌ మొదలెట్టేశాడు..!

28
kamal

ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న లోక నాయకుడు కమల్..తాజాగా నెక్ట్స్ ప్రాజెక్టు షూటింగ్‌ను మొదలు పెట్టేశాడు. లోకేష్ కనగ రాజ్ దర్శకత్వం లో విక్ర‌మ్ అనే సినిమా చేస్తుండగా సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఇంటర్‏నేషనల్ ఫిలింస్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మిస్తున్నారు.

క‌మ‌ల్ హాస‌న్‌తో క‌లిసి చిత్ర బృందం క‌లిసి దిగిన ఫొటోల‌ను కూడా విడుద‌ల చేశారు. వ‌చ్చే ఏడాది విక్ర‌మ్ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్లాన్‌లో ఉన్నారు మేక‌ర్స్. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌లో బ్లాక్ అండ్ వైట్ కలర్ లో మూడు కోణాలలో కమల్ ఫేస్ మాత్రమే కనిపించేలా పోస్టర్ ను డిజైన్ చేశారు. ఈ పోస్ట‌ర్‌కి యుద్ధంతో అదిగో అదిగో వెలుగు..శబ్ధంతో అరాచకత్వం నాశనం..రక్తంతో అదిగో దొర్లుతున్న తల..ఇదిగో కనిపిస్తోంది చూడు స్వర్గం.. కంపిస్తున్న భుజం..గెలుపు నిజం అంటూ రాసుకొచ్చారు. ఈ సినిమాలో విలన్ గాప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తుండగా విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.