ఛత్రపతి హిందీ రీమేక్ ప్రారంభం..

51
rajamouli

అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నటుడు బెల్లంకొండ శ్రీనివాస్. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్న శ్రీనివాస్ తాజాగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ఇవాళ లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టగా ఇక ఛత్రపతి ఒరిజినల్ వెర్షన్‌కి కధను అందించిన ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మరోసారి హిందీకి కథను సమకూరుస్తున్నారు.

2005లో తెలుగులో విడుదలైన ఛత్రపతి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్‌ను స్టార్‌ హీరోగా నిలబెట్టిన సినిమా ఇది. దాదాపు 16 ఏళ్ల అనంతరం ఈ సినిమా హిందీ రేమేక్‌ ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీకి సిద్ధమయ్యాడు బెల్లంకొండ.