5k రన్‌లో పాల్గొన్న కోలేటి దామోదర్…

419
koleti damodhar
- Advertisement -

ప్రపంచ కాన్సర్ దినం సందర్భంగా 5K రస్ లో పాల్గొన్న కోలేటి దామోదర్ ఈ రోజు ఉదయం నెక్లస్ రోడ్ లో ఇస్కాన్ సంస్థ స్వామీజీ మహాశృంగదాస ఆధ్వర్యంలో ప్రపంచ కాన్సర్ దినం సందర్భంగా నిర్వహించిన 5K రన్ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారు మాట్లాడుతూ మన దేశంలో రోజు రోజుకి కాన్సర్ మమమ్మారి విస్తరిస్తున్నదనీ, ఇందుకు మన ఆహారపు అలవాట్లే కారణమని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పిమ్మట ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన శ్రీ కే. చంద్రశేఖర్ రావు గారు తెలంగాణా ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా ప్రభుత్వం ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు చేపట్టిందని, ఆరోగ్య స్పృహ లేని పేదప్రజలు కలుషితమైన నీటిని త్రాగటం మూలంగా అనారోగ్యం పాలవుతున్నారని భావించిన కేసిఆర్ గారు మారుమూల ప్రాంతాలలోని పల్లె ప్రజలకు కూడా పరిశుద్ధమైన మంచి నీటిని అందించడానికి “మిషన్ భగీరథ” పేరుతో బృహత్ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టారని, ఈ కార్యక్రమం జయ ప్రదమై దేశనాయకుల ప్రశంసలు పొందటమే కాక, యావత్ ప్రపంచ దృష్టినీ ఆకర్షించిందని అన్నారు.

కేసిఆర్ గారు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేశారని, స్త్రీలకు, బాలలకు ప్రయోజనం చేకూర్చే ఆరోగ్య లక్ష్మి,అమ్మఒడి, “కేసిఆర్ కిట్” వంటి పథకాలను చేపట్టారని, క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల పారితోషికాన్ని వెయ్యి రూపాయల నుంచి ఆరు వేలకు పెంచారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రుల కోసం అన్ని వసతులతో భవనాల నిర్మాణం జరిగిందని, నలభై ప్రభుత్వ ఆస్పత్రుల డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నారని, 22 ప్రభుత్వ ఆస్పత్రిలో ఐ.సి.యు. కేంద్రాలను, రాష్ట్రంలో 12
చోట్ల కాన్సర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారని, గత ప్రభుత్వాల హయాంలలో ప్రభుత్వ ఆస్పత్రిలో ఇలాంటి సౌకర్యాలు కలలో కూడా ఊహకు అందలేదని, జంటనగరాలలో తక్షణ వైద్యం అందించడం కోసం ఎమెర్జెన్సీ మోటార్ సైకిల్ సేవలను, యాబై టీకా బండ్లను పేద వారు నివసిస్తున్న బస్తీలలో తిప్పుతూ, ప్రజల వద్దకే వైద్యాన్ని టి.ఆర్.ఎస్ ప్రభుత్వం తీసుకెళ్ళిండమే కాక పేదలు నివసించే బస్తీలలో బస్తీ దవాఖానాలను కూడా ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు.

కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించి, ఊరూరా నేత్ర వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, అవసరమైన వారికి అద్దాలు, మందులు ఉచితంగా అందించడం జరుగుతుందని, ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తూ, శాశ్వత అంధత్వ నివారణకు కేసిఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఇటువంటి పథకం భారతదేశంలో ఇదే ప్రథమని, ఇంత వరకూ ఏ ప్రభుత్వం ఈ విధమైన ఆలోచన కూడా చేయలేదని ఆయన అన్నారు.

koleti damodhar

ఈ విధంగా మాన్య ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా, సంపన్న దేశాలలో మాత్రమే అందుబాటులో వున్న ప్రతిఏటా వైద్య పరీక్షలు చేయించుకునే కార్యక్రమాన్ని కేసిఆర్ ప్రభుత్వం పేదప్రజలకు అందుబాటులోకి తెచ్చి, ప్రజలకు “ఆరోగ్యసూచి” పేరుతో హెల్త్ కార్డులను జారీ చేస్తున్నదని, ఈ చర్యలతో తెలంగాణ ఆరోగ్య ముఖచిత్రమే వేగంగా మారిపోతుందని, సంపూర్ణమైన ఆరోగ్య తెలంగాణ ఏర్పడే కాలం ఎంతో దూరంలో లేదని శ్రీ కే. దామోదర్ అన్నారు.

ఇస్కాన్ సంస్థ వారు ఎన్నో ప్రజా ప్రయోజన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, అయిదు రూపాయలకే మంచి పోషకాలతో కూడిన భోజనాన్ని అందించి, పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారని, ఇంతే కాక,ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించటానికి ఎన్నో అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారని అందులో భాగంగానే కాన్సర్ పై అవగాహనకు 5K రన్ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమాలన్నింటినీ అత్యంత శ్రద్ధతో రూపొందిస్తున్న ఇస్కాన్ స్వామీజీ మహాశృంగదాస చేస్తున్న సేవ నిరుపమానమైనదని అన్నారు. రోజు రోజుకూ ఎంతో వేగంగా వ్యాప్తి చెందుతున్న కాన్సర్ బారిన పడకుండా ఉండటానికి ప్రజలు శ్రద్ధ వహించాలని, ఇందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, మంచి ఆహారపు అలవాట్లను కలిగి వుండాలని, మాదకద్రవ్యాలు, పొగాకు, జంక్ ఫుడ్ – అంటే బేకరీ ఆహారం,బిస్కెట్లు, చిప్స్ వంటి ప్రాసెస్ తిండ్లను పూర్తిగా మానుకొని ఇంట్లో అప్పటికప్పుడు వండుకున్న ఆహారాన్ని మాత్రమే భుజించాలని, మన పూర్వీకులు మనకందించిన అల్లం, వెల్లిపాయ, పసుపు, మిరియాలు,దాల్చినచెక్క వంటి దివ్యమైన ఔషధ గుణాలున్న దినుసులను ఆహారంలో తగిన మోతాదులో తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన అన్నారు.

- Advertisement -