మరోసారి నానికి జోడిగా మలయాళ బ్యూటీ

517
nani
- Advertisement -

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా మూవీలో హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాంపాదించుకుంది సాయి పల్లవి. తన అందం, డ్యాన్స్,, నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగు, తమిళ్, మలయాళంలో సినిమాలు చేస్తుంది. తెలుగులో ప్రస్తుతం ఆమె నాగచైతన్యకు జోడిగా నటిస్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈమూవీకి లవ్ స్టోరీ అనే టైటిల్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఇక ఈమూవీతో పాటు రానా హీరోగా నటిస్తున్న విరాటపర్వం సినిమాలో నటిస్తుంది.

Nani Sai Pallavi

వేణు ఉడుగుల ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. నేచురల్ స్టార్ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే ఈమూవీలో నానికి జోడిగా సాయి పల్లవిని తీసుకున్నారని సమాచారం. ప్రస్తుతం నాని వి సినిమాతో పాటు టక్ జగదీశ్ అనే సినిమాల్లో నటిస్తున్నాడు. ఈరెండు సినిమాలు పూర్తి కాగానే రాహుల్ సాంకృత్యన్ తో సినిమా చేయనున్నాడు. కాగా నాని సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన ఎంసీఏ సినిమా భారీ విజయాన్ని సాధించిన సంగతీ తెలిసిందే. దీంతో మరోసారి వీరిద్దరు కలిసి నటించడంతో ఈమూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -