TTD: 25న కోయిల్ అల్వార్ తిరుమంజనం

1
- Advertisement -

ఈనెల 30వ తారీఖున విశ్వావసు నామ సంవత్సర తెలుగు ఉగాదిని పురస్కరించుకుని, టీటీడీ శ్రీవారి ఆలయంలో మార్చి 25వ తారీఖున కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనుంది.

ఈ కారణంగా మంగళవారం శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది.అదే విధంగా, మార్చి 30 ఆదివారం నాడు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని, సహస్ర దీపాలంకార సేవ మినహా అన్ని ఆర్జిత సేవలను రద్దు చేయడమైనది.

మార్చి 25 మరియు 30 తేదీలలో ప్రోటోకాల్ పరిధిలోని విఐపి లకు మాత్రమే విఇపి బ్రేక్ దర్శనాలు ఉంటాయి. ఈ కారణంగా మార్చి 24వ తారీఖున, అదే విధంగా మార్చి 29న విఐపి బ్రేక్ దర్శనాలకి సంబంధించి ఎటువంటి సిఫార్సు లేఖలను స్వీకరించడం జరగదు. ఈ అంశాలని భక్తలు దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించవలసిందిగా కోరడమైనది.

Also Read:తొలి జెండా యాదిలో…

- Advertisement -