‘ బ్యాడ్మింటన్ సింధు చాలా తక్కువ సమయంలోనే అద్భుత ప్రదర్శనతో అద్భుత విజయాలు సాధిస్తోంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సింధును చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అని భారత మాజీ స్పిన్సర్ బిషన్ సింగ్ బేడీ అన్నారు.
ఢిల్లీలో ఓ క్రీడా సంచిక కార్యక్రమంలో పాల్గొన్న బేడీ మాట్లాడుతూ..దక్షిణాఫ్రికా పర్యటనలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి కఠిన పరీక్షలు తప్పవని బేడీ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న కోహ్లీ సేనకు దక్షిణాఫ్రికా పర్యటన అతి పెద్ద సవాలు కానుందన్నారు. విదేశీ గడ్డపై రాణించడం ఆషామాషీ కాదని, వరుసగా తొమ్మిది టెస్ట్ సిరీస్‌లు నెగ్గి జోరుమీదున్నప్పటికీ దక్షిణాఫ్రికా వంటి దేశాలతో తలపడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందన్నారు. నిజానికి ఇదో పెద్ద పరీక్ష అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడామంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్ పాల్గొన్నారు.
కాగా..జనవరి 5 నుంచి సఫారీ గడ్డపై టీమిండియా మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాకి చేరుకున్న భారత్ జట్టు.. అక్కడి పరిస్థితులకి అలవాటు పడేందుకు ప్రయత్నిస్తోంది.