కోహ్లి చేజింగ్ రికార్డ్

215
Kohli snuff out West Indies
- Advertisement -

కరీబియన్‌ గడ్డపై టీమ్‌ఇండియాకు అద్భుత విజయాన్ని అందించాడు కెప్టెన్ విరాట్.  బ్యాటింగ్‌.. బౌలింగ్‌.. ఫీల్డింగ్‌ ఇలా అన్ని రంగాల్లో సమష్టిగా సత్తాచాటిన భారత్‌ తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది.  విరాట్‌ కోహ్లి(111 నాటౌట్‌: 115 బంతుల్లో 12×4, 2×6) అజేయ శతకం ముందు విండీస్ బౌలర్లు తేలిపోయారు. దీంతో కింగ్‌స్టన్‌లో జరిగిన చివరి వన్డేలో వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో భారత్‌ ఘనవిజయం సాధించింది. దీంతో 3-1 తేడాతో సిరీస్‌ను కోహ్లీసేన సొంతం చేసుకుంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ను విరాట్‌ కోహ్లి అందుకోగా.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డును ఆజింక్య రహానె దక్కించుకున్నాడు.

ఇక వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో సెంచరీ బాదిన విరాట్ కోహ్లి.. రికార్డుల మోత మోగించాడు. తాజా సెంచరీతో శ్రీలంక దిగ్గజ బ్యాట్స్‌మన్ జయసూర్యను అందుకున్న కోహ్లి.. క్రికెట్ గాడ్ టెండూల్కర్ రికార్డును చెరిపేశాడు.

Kohli snuff out West Indies

కోహ్లికి వన్డేల్లో ఇది 28వ సెంచరీ. చేజింగుల్లో 18వది. అంటే చేజింగ్‌లో కోహ్లి ఎలా చెలరేగిపోతాడో అర్థమవుతోంది. భారత్ తరఫున చేజింగ్‌లో ఒక బ్యాట్స్‌మన్‌కు ఇవే అత్యధిక సెంచరీలు. గతంలో ఈ రికార్డు సచిన్ పేరిట ఉండేది. సచిన్ చేజింగ్‌లో 17 సెంచరీలు సాధించాడు. 232 ఇన్నింగ్స్‌లు ఆడి సచిన్ ఈ రికార్డును నెలకొల్పాడు. కానీ కేవలం 102 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లి సచిన్ రికార్డును ఊదేశాడు. ఈ చేజింగ్ సెంచరీల లిస్టులో శ్రీలంక స్టార్ తిలకరత్నే దిల్షాన్ మూడో స్థానంలో ఉన్నాడు. 116 ఇన్నింగ్స్‌ల్లో 11 చేజింగ్ సెంచరీలను దిల్షాన్ సాధించాడు.

వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన  వారిలో సచిన్(49), పాంటింగ్(30) తరవాత 28 సెంచరీలతో జయసూర్య మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు జయసూర్యతో కోహ్లి జతకలిశాడు. అయితే జయసూర్య 28 సెంచరీలు చేయడానికి 433 ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది. కానీ కోహ్లి కేవలం 181 ఇన్నింగ్స్ మాత్రమే తీసుకున్నాడు.

- Advertisement -