IND vs ENG :కోహ్లీ కంప్లీట్ గా దూరమైనట్టే?

18
- Advertisement -

టీమిండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్ లు కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. ఈ రెండు టెస్ట్ మ్యాచ్ లలో ఇరు జట్లు చెరో విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఈ రెండు టెస్ట్ మ్యాచ్ లకు కూడా దూరమైన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీ దూరమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ నెల 15 నుంచి స్టార్ట్ అయ్యే మూడో టెస్ట్ మ్యాచ్ కు కోహ్లీ అందుబాటులో ఉంటాడా లేదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ప్రస్తుతం క్రీడా వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మూడో టెస్ట్ కు కూడా కోహ్లీ అందుబాటులో ఉండడని సమాచారం. కోహ్లీ సతీమణి అనుష్క ప్రగ్నెంట్ కావడంతో ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయించే ఉద్దేశంతో కోహ్లీ జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన టెస్ట్ మ్యాచ్ లకు కూడా కోహ్లీ దాదాపు దూరమైనట్లేనని సమాచారం..

అయితే కోహ్లీ లేకపోయినప్పటికి జట్టు పటిష్టంగానే ఉంటూ అద్బుతంగా రానిస్తోంది. ఈ నెల 15 నుంచి రాజ్ కోట్ లో మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. మూడో టెస్ట్ విజయం కోసం రెండు జట్లు కూడా పట్టుదలగా ఉన్నాయి. ఇక గాయం కారణంగా రెండో టెస్ట్ కు దూరమైన కే‌ఎల్ రాహుల్, జడేజా మూడు టెస్ట్ నాటికి అందుబాటులో ఉంటారా లేదా అనేది సందేహమే. అయితే కే‌ఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకున్నాడని అతడు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని టాక్. జడేజా కోలుకోవడానికి ఇంకాస్త సమయం పట్టనుంది. ఇక మూడు టెస్ట్ కోసం జట్టులో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ మూడో టెస్ట్ తో ఆరంగేట్రం చేసే అవకాశం ఉన్నట్లు వినికిడి. ఇక గత రెండు టెస్ట్ లలో నిరాశ పరిచిన కెప్టెన్ రోహిత్ శర్మ మూడో టెస్ట్ తోనైనా ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

Also Read:ఆ హీరో వైపే చూస్తూ ఉండిపోయేదట

- Advertisement -