ఆ హీరో వైపే చూస్తూ ఉండిపోయేదట

15
- Advertisement -

నటి ఆశ్రిత వేముగంటి నండూరి ‘యాత్ర 2’ లో విజయమ్మ పాత్రలో నటించి మెప్పించింది. ముఖ్యంగా ఆమె మళయాళ సీనియర్ హీరో మమ్ముట్టితో కలిసి చాలా సన్నివేశాల్లో పోటాపోటీగా నటించింది. ఆశ్రిత వేముగంటి ఇంతకుముందు తెలుగులో “బాహుబలి”, యాత్ర పార్ట్ 1” వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.ప్రస్తుతం తెలుగులో బిజీగా సినిమాలు చేస్తున్న ఈ నటి యాత్ర 2 సినిమా గురించి మీడియాతో ముచ్చటించింది. “యాత్ర 2”లో జగన్అ మ్మ పాత్రలో నటించాను.

ఇది పొలిటికల్ సినిమానే కానీ, ఈ సినిమాలో అద్భుతమైన ఎమోషన్స్ తో కూడిన కథ కూడా వుంది. మమ్ముట్టి  తో నాకు మంచి కెమిస్ట్రీ కుదిరింది. మా మధ్య బాండింగ్ కూడా యూనిక్ గా ఉంటుంది అని చెప్పగలను. మమ్ముట్టి చాలా పాజిటివ్ ఎనర్జీతో వుంటారు. ఆయనతో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభూతి. ముఖ్యంగా ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్కోసారి ఆయన వైపే చూస్తూ ఉండిపోయేదాన్ని. ఆయన అంత సహజంగా నటిస్తారు. ఆయన నుంచి నేను కూడా ఎంతో నేర్చుకున్నాను’ అని ఆశ్రిత వేముగంటి నండూరి చెప్పుకొచ్చింది.

ఆశ్రిత వేముగంటి నండూరి ఇంకా మాట్లాడుతూ.. ‘కొన్ని అద్భుతమైన న్యాచురల్ లోకేషన్స్ లో ఈ సినిమాని తీశారు. సినిమా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. నాకు వ్యక్తిగతంగా ఫ్యామిలీ సినిమాలు చేయాలని ఉంది. అలాగే సూపర్ నేచురల్ సినిమాలు చేయాలని వుంది. కానీ అవకాశాలు కూడా రావాలి కదా. ఒక్కటి మాత్రం నేను చాలా స్పష్టంగా ఉన్నాను. మంచి పాత్రలు మాత్రమే చేస్తాను’ అంటూ ఆశ్రిత వేముగంటి చెప్పుకొచ్చింది.

Also Read:పెసర మొలకలతో ఆరోగ్యం

- Advertisement -