టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఫీట్ సాధించాడు. ఇంగ్లాండ్‌పై వెయ్యి పరుగులు పూర్తి చేసిన 13వ భారత ఆటగాడిగా నిలిచాడు.బర్మింగ్ హోమ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు సెంచరీ సాధించాడు. ఓ వైపు సహచర బ్యాట్స్ మెన్ తక్కువ పరుగులకే పెవిలియన్‌కు క్యూ కడుతుంటే కోహ్లీ మాత్రం తన బ్యాట్‌కు పని చెప్పాడు.
225 బంతుల్లో 22 ఫోర్లు,1 సిక్సర్ సాయంతో 149 పరుగులు చేశాడు. టీమిండియా 274 పరుగులకు ఆలౌట్ కాగా అందులో కోహ్లి ఒక్కడే సగానికంటే ఎక్కువ పరుగులు చేశాడు. కోహ్లీ టెస్టు కెరీర్‌లో ఇది 22వ సెంచరీ కాగా కెప్టెన్‌గా 15వ సెంచరీ.
ఇంగ్లాండ్‌పై సెంచరీతో క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును సైతం అధిగమించాడు విరాట్. సచిన్ 114 ఇన్నింగ్స్‌లో 22 సెంచరీలు చేస్తే…కోహ్లి 113 ఇన్నింగ్స్‌లో 22 సెంచరీలు చేశాడు.
కోహ్లీ తన పోరాట పటిమతో ఫ్యాన్స్‌తో పాటు మాజీ క్రికెటర్లను ఫిదా చేశాడు. ముఖ్యంగా సెంచరీ సాధించినప్పుడు కోహ్లీ చూపించి హవాభావాలు ఫ్యాన్స్‌ని మంత్ర ముగ్దులను చేశాయి. మ్యాచ్ ముగించుకుని కోహ్లీ తిరిగి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న సమయంలో మైదానంలో అభిమానులంతా లేచి చప్పట్లు కొడుతూ అభినందించారు.