ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గోన్న రానా..

192
NTR, daggubati rana

మ‌హాన‌టుడు నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత చ‌రిత్ర ఆధారంగా బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ ఈచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టిస్తుండ‌గా..ఆయ‌న సతిమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో బాలీవుడ్ న‌టీ విద్యాబాల‌న్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇటివ‌లే ఈమూవీ రెగ్యూల‌ర్ షూటింగ్ ను హైద‌రాబాద్ లో ప్రారంభించారు. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఈషూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. బాల‌కృష్ణ‌..విద్యాబాల‌న్ పై కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రిక‌రిస్తున్నారు.

RANA, chandrababu naidu

ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్ర‌బాబునాయుడు పాత్ర‌లో హీరో ద‌గ్గుబాటి రానా నటిస్తున్న విష‌యం తెలిసిందే. నేటినుంచి రానా ఎన్టీఆర్ మూవీ షూటింగ్ లో పాల్గొంట‌డ‌ని తెలుస్తుంది. చంద్ర‌బాబు పాత్ర‌లో న‌టించ‌డానికి ముందు రానా చంద్ర‌బాబు నాయుడు బాడీ లాగ్వేజ్ , మాట‌ల‌ను ప్రాక్టిస్ చేస్తున్నాడ‌ట‌. ఎన్టీఆర్, చంద్ర‌బాబు నాయుడు మ‌ధ్య‌లో జ‌రిగే కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రిక‌రించ‌నున్నారు. అక్కినేని నాగేశ్వ‌ర్ రావు పాత్ర‌ను సుమంత్ చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈసినిమ‌లో ఓ స్పెష‌ల్ సాంగ్ లో ర‌కుల్ ప్రిత్ సింగ్ క‌నిపించ‌నుంది.