బర్త్ డే గిఫ్ట్..లవర్ ఎవరో చెప్పేసిన రాహుల్

158
rahul
- Advertisement -

టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాను ప్రేమిస్తుంది ఎవరినో అన్న విషయాన్ని ఇంతకాలం సస్పెన్స్‌గా ఉంచిన రాహుల్…తాజాగా రివీల్ చేశారు. అతియాశెట్టి, తాను ప్రేమించుకుంటున్నామని అధికారికంగా ప్రకటించారు రాహుల్. ఇందుకు సంబంధించిన ఫోటోను రివీల్ చేశారు.

ప్రముఖనటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియాశెట్టి. ఆమె పుట్టినరోజున రాహుల్ వారి సంబంధాన్ని ధ్రువీకరిస్తూ ప్రేమించుకున్న చిత్రాలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.రాహుల్ తన లేడీ లవ్‌కి హృదయం ఎమోజీతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

కేఎల్ రాహుల్ పూర్తి పేరు కన్నూర్ లోకేశ్ రాహుల్.ఈయన కర్ణాటకలోని మంగళూరుకు చెందినవారు. ఐపీఎల్ 2020లో కింగ్స్ 11 పంజాబ్ కెప్టెన్‌గా,భారత స్టార్ బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్నాడు రాహుల్. ఇక అతియాశెట్టి 2015లో సూరజ్ పంచోలీ సరసన ‘హీరో’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. చివరిగా నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన మోతీచూర్ చక్నాచూర్‌లో కనిపించింది.

- Advertisement -