ఈ సీజన్ ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ ఆటగాడు కేఎల్ రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే రాహుల్‌కి రూ.11 కోట్లు పెట్టి కింగ్స్ ఎలెవన్ జట్టు తీసుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అతనికి అనవసరంగా రూ.11 కోట్లు పెట్టి తీసుకున్నారని అనుకున్నారు. కానీ రాహుల్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. పంజాబ్ జట్టుకు విజయాలు అందిస్తున్నారు. నిన్న రాజస్థాన్-కింగ్స్ ఎలెవన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాహుల్(84) పరుగులు చేసి ఒంట్టి చేత్తో మ్యాచ్ గెలిపించాడు.
నిన్నటి మ్యాచ్‌లో ఐపీఎల్ కెరీర్లోనే అత్యధిక స్కోరు(84) నమోదు చేశాడు రాహుల్. ఈ సీజన్లో ఆడిన 9 మ్యాచ్‌లలో 47 పరుగుల సగటుతో 376 పరుగులు చేశాడు. మరోవైపు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఈ ఐపీఎల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. అయితే ఇదే సమయంలో నెటిజన్లు రోహిత్ శర్మపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాలో రోహిత్ శర్మ స్థానంలో రాహుల్‌ను ఎందుకు తీసుకోకూడదన్న చర్చని ట్విట్టర్ వేదికగా అభిమానులు లేవనెత్తారు.
వచ్చే వరల్డ్ కప్‌లో ఓపెనర్‌గా రోహిత్ స్థానంలో సరైన ఓపెనర్ రాహుల్ అవుతాడంటూ చాలా మంది క్రికెట్ అభిమానులు ట్విట్టర్లో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరోవైపు సెలక్టర్లు కూడా రోహిత్‌ని తీసుకుని మరోసారి తప్పు చేయరాదని సూచిస్తున్నారు. వచ్చే వరల్డ్ కప్‌లో రోహిత్ ఆడతాడా? లేదా అనే అనుమానం వ్యక్తం అవుతుంది.