టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా..

150
kkr
- Advertisement -

షార్జా వేదికగా ఈ రోజు రాత్రి ఐపీఎల్‌-2020లో భాగంగా మరో ఆసక్తికర పోరు ఆరంభమైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్లు షార్జా వేదికగా తలపడుతున్నాయి. రెండు జట్లలోనూ హిట్టర్లు ఉండటంతో ఈ పోరులో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. చిన్న మైదానం, ఫ్లాట్‌ వికెట్‌ కావడంతో షార్జాలో భారీ స్కోరు నమోదవుతున్నాయి.

టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ స్థానంలో రాహుల్‌ త్రిపాఠిని తుది జట్టులోకి తీసుకున్నట్లు కార్తీక్‌ చెప్పాడు. క్యాపిటల్స్‌ సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కోల్‌కతాతో మ్యాచ్‌కు తిరిగి జట్టులోకి వచ్చాడు. అక్షర్‌ పటేల్‌ స్థానంలో అశ్విన్‌… పేసర్‌ ఇషాంత్‌ శర్మ స్థానంలో హర్షల్‌ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నట్లు అయ్యర్‌ వివరించాడు.

- Advertisement -