దుబ్బాక ప్రజలంతా TRS కే ఓటేయాలి..

108
NRI TRS

లండన్ : ఎన్నారై టి.ఆర్.యస్ యూకే కార్యవర్గ సమావేశాన్ని లండన్ లో నిర్వహించినట్టు అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు. స్థానిక కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, ఆరుగురు మాత్రమే కలుసుకొని మిగితా వారందరు ఆన్‌లైన్‌ జూమ్ మీటింగ్ ద్వారా పాల్గొన్నట్టు అశోక్ గౌడ్ తెలిపారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఇటీవల అనారోగ్యంతో మరణించిన దుబ్బాక ఎమ్మల్యే సోలిపేట రామలింగా రెడ్డికి నివాళ్ళర్పించి, రాబోయే దుబ్బాక ఎన్నికల్లో ఎన్నారై టి.ఆర్.యస్ ప్రచారంపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం, గత కొన్ని నెలలుగా కోవిడ్ వల్ల ఇబ్బందులు పడ్డ ఎంతో మందికి స్థానిక యూకేలో మరియు స్వరాష్ట్రం తెలంగాణలో చేసిన వివిధ సేవా కార్యక్రమాలకు సహకరించిన కార్యవర్గసభ్యులని అభినందించి, భవిష్యత్తులో చేయవలసిన సేవా కార్యక్రమాలపై చర్చించినట్టు అశోక్ తెలిపారు.

సమావేశంలో ముందుగా సోలిపేట రామలింగా రెడ్డి చిత్ర పటానికి పూలు వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఎన్నారై టి.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం సభ్యులందరితో మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా ఎన్నో ఎన్నికలకు ప్రత్యక్షంగా వెళ్ళి ప్రచారం నిర్వహించడమే కాకుండా పరోక్షంగా ఇటు సోషల్ మీడియా ద్వారా మరియు వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించడంలో మనమంతా ముందుండి పార్టీకే సేవ చేశామని అదే స్పూర్తితో కెసిఆర్ నాయకత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షా అనే సంకల్పంతో దుబ్బాకలో సైతం మనం మన బాధ్యత నిర్వహించాలని సభ్యులకి దిశా నిర్దేశకం చేశారు.

కార్యవర్గ సభ్యుల ఆలోచనలు సలహాలతో ప్రత్యేక కార్యాచారణ రూపొందించినట్టు ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి తెలిపారు. కార్యాచారణలో భాగంగా అడ్వైసరీ బోర్డు వైస్ చైర్మన్ సిక్కా చంద్ర శేఖర్ గౌడ్ మరియు ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల సంయుక్త నాయకత్వం లోని ఎన్నారైల బృందం దుబ్బాక నియోజిక వర్గంలో పర్యటించి ప్రచారం నిర్వహిస్తుందని, దుబ్బాక అభివృద్ధి పై ప్రత్యేక కర పత్రాలని, అలాగే తెలంగాణ అభివృద్ధి కై కెసిఆర్ చేపట్టిన ఎన్నో సంక్షేమ పథకాల్ని ఇంటింటికి ప్రచారం చేసేలా వివిధ కార్యక్రమాలని చేపట్టేలా కార్యాచారణ ఏర్పాటు చేస్తున్నామని ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి తెలిపారు.

స్థానిక దుబ్బాక ఎన్నికల్ని అన్నీ తానై ముందుకు నడిపిస్తున్న ఓటమెరుగని ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావుతో ప్రత్యేక సమేవేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని వారి సలహాలు సూచనలతో వీలైనంత వరకు దుబ్బాకలో టి.ఆర్.యస్ అభ్యర్థి గెలుపుకి కృషి చేస్తామని సిక్కా చంద్ర శేఖర్ గౌడ్ మరియు రత్నాకర్ కడుదుల తెలిపారు.

కార్యదర్శి సత్య చిలుముల మాట్లాడుతూ, దుబ్బాకలో టి.ఆర్.యస్ అభ్యర్థి గెలుపుకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై టి.ఆర్.యస్ శ్రేణులందరితో సంప్రదించి, దుబ్బాక నియోజిక వర్గ పరిధిలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడ్డ ఎన్నారై మిత్రులుంటారని, వీలైనంత మంది తో సంప్రదించి వారి కుటుంబ సభ్యులందరినీ టి.ఆర్.యస్ పార్టీకే ఓటు వేసేలాగా అభ్యర్దించాలని కోరుతామని తెలిపారు. కార్యవర్గ సమావేశానికి హాజరైన సభ్యులకు, పది సంవత్సరాల తన అనుభవంతో అందరికి దిశా నిర్దేశం చేసి, ఇటీవల కరోనా సమయంలో ఎంతో మంది విద్యార్థులకు సహాయ పడేలా “కెసిఆర్ కూపన్స్” అనే విప్లవాత్మక కార్యక్రమాన్ని రూపొందించిన అనిల్ కూర్మాచలంకి, వాటిని అమలు పరిచిన అశోక్ మరియు చంద్ర శేఖర్ లకు సత్య చిలుముల ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

చివరిగా అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ దుబ్బాక ప్రజలంతా విజ్ఞతతో అలోచించి టి.ఆర్.యస్ పార్టీకే ఓటు వెయ్యాలని, బాధ్యత గల టి.ఆర్. యస్ పార్టీ కార్యకర్తలుగా నాడు ఉద్యమం నుండి నేటి పునర్నిర్మాణం వరకు కెసిఆర్ వెంటే ఉన్నామని, భవిష్యత్తులో కూడా కెసిఆర్ ఆలోచనలతో ఆశయాలతోనే ముందుకు వెళ్తామని, మైళ్ళ దూరంలో ఉన్న పార్టీకి సేవ చేసే అవకాశం కలిగించినందుకు కెసిఆర్ గారికి, కేటీఆర్ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.