ప్రభాస్ పంపిన బిర్యానీకి కరీనా ఫిదా..

53

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా పాన్ ఇండియా స్థాయిలో ఆదిపురుష్ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ప్రస్తుతం ముంబయిలో ఉంటున్నారు. ఈ సందర్భంగా సైఫ్ అలీ ఖాన్ కుటుంబం కోసం ప్రభాస్ ప్రత్యేకంగా వివిధ వంటకాలు తయారు చేయించి పంపించారు. ప్రభాస్ పంపిన వంటకాల్లో స్పెషల్ బిర్యానీ, ఖీర్, నాన్ వెజ్ కర్రీ ఉన్నాయి. అయితే సైఫ్ భార్య కరీనా కపూర్ ఈ వంటకాల ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

kareena

బాహుబ‌లి బిర్యానీ పంపించాడంటే అది క‌చ్చితంగా బెస్ట్‌గానే ఉంటుంది.. అని క‌రీనా క‌పూర్ ఆదివారం త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫొటో షేర్ చేస్తూ చేసిన కామెంట్ పెట్టింది. ఈ స్పెష‌ల్ బిర్యానీని లొట్ట‌లేస్తూ ఎంజాయ్ చేసింది. ప‌నిలో ప‌నిగా దీనిని పంపిన ప్ర‌భాస్‌కు థ్యాంక్స్ చెప్పింది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే లాల్ సింగ్ చ‌ద్దాలో ఆమిర్ ఖాన్ స‌ర‌స‌న క‌రీనా క‌నిపించ‌నుంది.