గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న నీతి ఆయోగ్ సీఈవో..

55

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఢిల్లీ మోతిబాగ్ లోని తన నివాస ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు సంతోష్‌ కుమార్‌, వెంకటేష్ నేత పాల్గొన్నారు. అనంతరం నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌కు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ వృక్ష వేదం పుస్తకాన్ని బహుకరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం, వృక్ష వేదం పుస్తక వివరాలు తెలుసుకొని ఎంపీ సంతోష్ కుమార్‌ను అమితాబ్ కాంత్ అభినందించారు.

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమం ముందుకు సాగాలని అమితాబ్ కాంత్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహా హరిత ఉద్యమానికి శ్రీకారం చుట్టారని పేర్కోన్నారు. ప్రతి గ్రామానికి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ఇదే విధంగా ముందుకు సాగితే తప్పకుండా పర్యావరణ మార్పులపై విజయం సాధించగలమని అమితాబ్ కాంత్ తెలిపారు. త్వరలోనే మరో ముగ్గురిని ఈ హరిత సవాల్ కి నామినేట్ చేస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని ఆయన కోరారు. ఈ మేరకు ఎంపీ సంతోష్ కుమార్ నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ కు ధన్యవాదాలు తెలిపారు.