కేకేఆర్ కు షాకిచ్చిన సిరాజ్

222
siraj
- Advertisement -

ఐపీఎల్‌-2020లో భాగంగా రాయల్ ఛాలెంజర్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది కోల్ కతా. టామ్‌ బాంటన్‌, ప్రసిధ్‌ కృష్ణలను తుది జట్టులోకి తీసుకున్నట్లు మోర్గాన్‌ వెల్లడించాడు. షాబాద్‌ అహ్మద్‌ స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌ జట్టులోకి వచ్చినట్లు బెంగళూరు సారథి విరాట్‌ పేర్కొన్నాడు.

ఇక ఆరంభంలోనే కేకేఆర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ఓపెనర్ త్రిపాఠిని,తర్వాతి బంతికి రానాను చక్కటి బంతితో పెవిలియన్ పంపాడు సిరాజ్‌. పాయింట్ల పట్టికలో బెంగళూరు ఆడిన తొమ్మిదింటిలో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా కోల్‌కతా అన్నే మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి 10 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

- Advertisement -