ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే గెలుపు: మంత్రి జగదీష్ రెడ్డి

55
Jagadish Reddy

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే గెలుపు అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ స్ధాయి సన్నాహాక సమావేశం జరుగగా ముఖ్యఅతిథిగా హాజరైన జగదీష్ రెడ్డి…ఈ దేశంలో గర్వంగా ,కాలర్ ఎగరేసి, గొప్పగా నేను TRS పార్టీ కార్యకర్తనని చెప్పేఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు.

ఆ ధైర్యం, దమ్ము, నైతికత,హక్కు ఒక్క TRS కార్యకర్తకే ఉందని…..తెలంగాణ ప్రభుత్వాన్ని వెలెత్తితే ఇది తప్పు అని చెప్పే అవకాశమే ఎక్కడ లేదన్నారు.మోడీ ,సోనియా సొంత రాష్ట్రంలో రాష్టాల్లో ఇప్పటికి ఉచిత కరంట్ లేదు…..ఈ దేశంలో ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిఫెస్టోను 100% అమలు చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్‌ మాత్రమేనన్నారు.

ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్‌దే గెలుపు…హుజుర్‌నగర్‌ అయిన దుబ్బాక అయిన.. గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలైన…ప్రజలు చాలా తెలివి గల వాళ్ళు…. సరైన తీర్పు ఇస్తారని తెలిపారు. టీఆర్ఎస్‌ అమలు చేసినాన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ దేశంలో ఏ పార్టీ అమలు చేయలేదు..పెద్ద పెద్ద మాటలు మాట్లాడే బీజేపీ నాయకులు చెప్పేది అంత డొల్లనే..అబద్ధాలే అన్నారు.

వాళ్ళు అధికారంలో ఉన్న రాష్టాల్లో చేసింది శూన్యం…..ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కార్యకర్తలు అహర్నిశలు కృషి చేసి ఓటర్ నమోదు ను సిరీస్ గా తీసుకొని చేరిపించాలన్నారు. టీఆర్ఎస్‌ కార్యకర్తలంటేనే సుషిక్తులైన సైనికులు అని నానుడి……ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఏది చేసినా నిబద్ధతతో , అంకుటిత దీక్ష తో చేస్తారు……..కార్యకర్తలు కూడా పట్టు విడవని దీక్షతో పని చేయాలన్నారు. ఈ సమావేశంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి,బండ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.