కేకేఆర్ పై ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో గెలుపు

123
morgan

ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా కోల్ కతా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 85 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 13.3 ఓవర్లలో వికెట్ కొల్పోయి 85 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫించ్ 16,పడిక్కల్ 25 పరుగులు చేసి ఔటైనా మిగితా పనిని పూర్తి చేశారు గుర్‌కిరాత్ సింగ్ మన్ 21‌, కోహ్లీ 18.

అంతకముందు టాస్ గెలిచిన కోల్ కతా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మోర్గాన్ తాను తీసుకున్న నిర్ణయం తప్పు అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 84 పరుగులు మాత్రమే చేసింది. హైదరాబాద్ బౌలర్ సిరాజ్‌ కోల్ కతా టాప్ ఆర్డర్‌ని కుప్పకూల్చాడు. పవర్ ప్లేలో 3 ఓవర్లు వేసిన సిరాజ్ కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(30: 34 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌) మాత్రమే రాణించగా శుభ్‌మన్‌ గిల్‌(1), రాహుల్‌ త్రిపాఠి(1), నితీశ్‌ రాణా(0), టామ్‌ బాంటన్‌(10), దినేశ్‌ కార్తీక్‌(4), పాట్‌ కమిన్స్‌(4) విఫలమయ్యారు. మహ్మద్‌ సిరాజ్‌(3/8), స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌(2/15) వికెట్లు తీశారు.