ఆర్సీబీకి షాక్…ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేకేఆర్ గెలుపు

232
kkr
- Advertisement -

ఐపీఎల్ 2021లో భాగంగా ఆర్సీబీకి షాకిచ్చింది కేకేఆర్. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘన విజయాన్ని నమోదుచేసింది. ఆర్సీబీ విధించిన 139 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 139 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్ 29, వెంకటేశ్ అయ్యార్ 26,నితీశ్ రానా 26 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూర్ భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. కోహ్లీ(39) రాణించడంతో నిర్ణిత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది.

దీంతో ఆర్సీబీ ఐపీఎల్ నుండి నిష్క్రమించగా కేకేఆర్ క్వాలిఫైర్ 2 లోకి ప్రవేశించింది. ఇక గత ఏడాది ఐపీఎల్ లో ఎలిమినేటర్ దశలో వెనుదిరిగిన బెంగళూర్ ఇప్పుడు అదే స్థానం నుండి వెనకకు వచ్చేసింది.

- Advertisement -