ఆర్సీబీపై కేకేఆర్ ఘనవిజయం..

46
rcb

ఐపీఎల్ 14 సెకండ్ ఫేజ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై ఘన విజయం సాధించింది కోల్ కతా నైట్ రైడర్స్. కెప్టెన్‌గా ఇదే తనకు చివరి ఐపీఎల్ అని కోహ్లీ ప్రకటించడంతో ఆర్సీబీ విజయంపై భారీ అంచనాలు నెలకొనగా ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ఆర్సీబీ ఘోరంగా పరాజయం పాలైంది.

కోల్ కతా విధించిన 93 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి 94 పరుగులు చేసి జయభేరి మోగించింది. కోల్‌కతా ఓపెనర్లు శుబ్‌మన్‌ గిల్‌ (34 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్‌), వెంకటేశ్‌ అయ్యర్‌ (27 బంతుల్లో 41 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగారు. వరుణ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ పేలవమైన పర్ఫామెన్స్‌ను కనబర్చింది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ చేసిన 22 పరుగులు తప్ప మిగితా ఆటగాళ్లు ఒక్కొక్కరుగా పెవిలియన్ బాటపట్టారు. దీంతో ఆర్సీబీ 92 పరుగులకే చాప చుట్టేసింది.