ఐపీఎల్ 15వ సీజన్‌లో భాగంగా కేకేఆర్ రెండో విజయాన్ని నమోదుచేసింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయబావుటా ఎగురవేసింది. పంజాబ్ విధించిన 137 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.3 ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 141 పరుగులు చేసి గెలుపొందింది.
ఆండ్రీ రసెల్ తనదైన శైలిలో తుఫాన్ ఇన్నింగ్స్‌తో కేకేఆర్‌ని గెలిపిందాడు. రసెల్ (31 బంతుల్లో 70 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్స్‌లు) విధ్వంసక బ్యాటింగ్ ముందు పంజాబ్ బౌలర్లు తేలిపోయారు.
ఇక అంతకముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 18.2 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. తొలి ఓవర్లోనే మయాంక్ (1) వెనుదిరగ్గా, ధావన్ (16) విఫలమయ్యాడు. లివింగ్‌స్టోన్ (19),షారుఖ్ (0) ప్రభావం చూపలేదు. భానుక రాజపక్స (9 బంతుల్లో 31; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా… కగిసో రబడ (16 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేశారు. 4 వికెట్లు తీసి పంజాబ్‌ను చిత్తుచేసిన ఉమేశ్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.