- Advertisement -
కిస్సింగ్ హీరోగా బాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం సంపాదించిన నటుడు ఇమ్రాన్ హష్మీ. ప్రతి సినిమాలో 20కి పైగా ముద్దులు పెట్టే ఇమ్రాన్ సీరియల్ కిస్సర్‌గా ఫేమస్ అయ్యాడు. తన సినిమాలతో బాలీవుడ్‌లో మోస్ట్ రొమాంటిక్ హీరోగా అమ్మాయిల గుండెల్లో స్థానం సంపాదించాడు.
ప్రస్తుతం చీట్ ఇండియా అనే సినిమా చేస్తున్న ఇమ్రాన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇకపై తాను కిస్సింగ్స్ సీన్స్ చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. పదిహేడేళ్లుగా ప్రతిసినిమాలో దాదాపు ఇరవై ముద్దులు పెడుతూ అలసిపోయానని చెప్పుకొచ్చాడు.
‘చీట్ ఇండియా’ భారతీయ విద్యా విధానంలో ఉన్న మాఫియా నేపథ్యంలో సాగుతుందని తెలిపాడు. ఇకపై కూడా తాను విభిన్న పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
- Advertisement -