నాగార్జున ‘మన్మథుడు2’లో అక్కినేని అమల

402
Manmadhudu2 Amala Akkineni
- Advertisement -

కింగ్ నాగార్జున సినిమాల్లో చెప్పుకోదగిన వాటిల్లో మన్మథుడు ఒకటి. ఈసినిమాతోనే ఇప్పటికి ఆయనను చాలామంది మన్మథుడిగానే పిలుస్తుంటారు. దేవదాస్ చిత్రం తర్వాత నాగార్జున మరే సినిమాకు సైన్ చేయలేదు. దేవదాస్ మూవీ అనుకున్నంతగా ఆడకపోవడంతో నిరాశలో ఉన్నాడు. తన తర్వాతి మూవీతో ఎలాగైనా విజయం సాధించాలని మంచి స్ర్కీప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆయన కెరీర్ లో పెద్ద హిట్ ఇచ్చిన మన్మథుడు సినిమాకు సీక్వేల్ చేయడానికి రెడీ అయ్యాడు నాగార్జున.

 Manmadhudu

మన్మథుడు చిత్రానికి సీక్వెల్ గా మన్మథుడు 2 టైటిల్ తో రాహుల్ రవీంద్రన్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. కథ పరంగా ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం యూరప్ లో జరుగుతుందట. తాజాగా ఈసినిమాకు సంబంధించిన మరో అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో నాగార్జున భార్య ‘అమల’ అతిథి పాత్రలో కనిపించనున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

నాగార్జునతో వివాహం తర్వాత అమల సినిమాలకు దూరమైంది. ఆ మధ్య వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో ఆమె తల్లిపాత్రలో మెప్పించారు. ఆ తరువాత ‘మనం’ సినిమాలో గెస్ట్ రోల్లో మెరిశారు. ఇప్పుడు ‘మన్మథుడు 2’లో ఒక అతిథి పాత్రలో ఆమె కనిపించనున్నట్టు సమాచారం. ఈవిషయంలో వాస్తవమెంత ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ వెయిల్ చేయాల్సిందే.

- Advertisement -