అక్కినేని యువ సామ్రాట్ నాగార్జున భావోద్వేగానికి గురయ్యారు. శర్వానంద్, అమల ప్రధాన పాత్రలో నటించిన ఒకే ఒక జీవితం చూసి ఆయన థియేటర్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తల్లిని గుర్తు చేసుకున్నట్లు చెప్పారు. ఒకే ఒక జీవితం ఒక భావోద్వేగభరితమైన చిత్రం. ఈ చిత్రం కచ్చితంగా మిమ్మల్ని కన్నీళ్లు పెట్టెలా చేస్తుంది. దీన్ని అందంగా తీర్చిదిద్దారు. తల్లి సెంటిమెంట్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా చూస్తే ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటారని నాగార్జున తెలిపారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు కన్నీళ్లు ఆగలేదు. మా అమ్మ ఆమె చూపించిన ప్రేమ గుర్తుకువచ్చింది. ఎమోషనల్‌గా అనిపించింది. అని నాగార్జున చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒకే ఒక జీవితం సినిమా టైమ్ ట్రావెల్, మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో శర్వానంద్, అమల, రితూ వర్మ, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. శ్రీ కార్తిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమల, శర్వానంద్ తల్లీకొడుకులుగా నటించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం బుధవారం ప్రీమియర్ ప్రదర్శించారు. సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదే చిత్రాన్ని తమిళంలో కణం పేరుతో విడుదల చేయనున్నారు.