పామును చూస్తే చాలు ఆమడ దూరం పరిగెడుతాం. అదే నాగుపామే ప్రత్యక్షమైతే ఆ పరిసరాల్లోనే జనం కనిపించరు. అంతలా ఈ విషపూరిత పాములకు భయపడతారు. పాములు కూడా అంతే. జనాలు సంచరించే ప్రాంతంలోకి వచ్చేందుకు భయపడతాయి. ఒకవేళ కంటపడినా వారితో తలపడదు. కానీ అవసరం, భయంకరమైన దప్పిక మనిషిని వెతుక్కుంటూ వచ్చిందికానీ కర్నాటక రాష్ట్రంలోని కైగా పట్టణంలో మాత్రం ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది.
ఈ పట్టణంలో కరువు తాండవం చేస్తోంది. తాగేందుకు మంచి నీటి దొరక్కా ప్రజలు ఎలా అయితే ఇబ్బందులు పడుతున్నారో అక్కడి జంతువులు కూడా నీరులేక అల్లాడి పోతున్నాయి. దీంతో దాహం తీర్చుకోవడానికి కింగ్ కోబ్రా గ్రామానికి చేరుకుంది. పాము పరిస్ధితిని గమనించిన స్ధానికుడు ఒక వాటర్ బాటిల్‌తో నీళ్లు అందించాడు.ఆ వ్యక్తి నీళ్లు పడుతుంటే ఎంచక్కా పడగ విప్పి నీటిని తాగింది. సామాన్యంగా జనసంచారంలోకి వచ్చేందుకు భయపడే పాములు… చుట్టుపక్కల జనం గుమికూడి ఉన్నాకూడా ఈ పాము ముందు దాహం తీర్చుకునేందుకే ప్రాధాన్యత ఇచ్చింది.
అయితే నీళ్లు పట్టే సమయంలో ఆ వ్యక్తి చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. విషయాన్ని అధికారులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి.. ఆ పామును అధికారులు పట్టుకుని జంతుసంరక్షణ శాలకు తరలించారు. అక్కడ కూడా మళ్లీ నీళ్లు తాగించారు.ఈ వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
#WATCH: Drought-hit villagers in Karnataka's Kaiga made King Cobra drink water from a bottle (March 24th) pic.twitter.com/SVEvg4GUKD
— ANI (@ANI) March 30, 2017