కోహ్లీని క్షమాపణ కోరిన బ్రాడ్ హగ్‌..

194
Brad Hodge apologizes to Virat Kohli
Brad Hodge apologizes to Virat Kohli
- Advertisement -

నాలుగు టెస్టుల సిరీస్ సందర్భంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల ఆటగాళ్ల మధ్య దూషణల పర్వం కొనసాగిన సంగతి తెలిసిందే. డీఆర్ఎస్ విషయంలో ఇండియా కెప్టెన్ కోహ్లీతో ఆసీస్ కెప్టెన్ స్మిత్ పలుమార్లు వాగ్వాదానికి దిగాడు. ఆసీస్ మాజీ బ్యాట్స్‌మన్ బ్రాడ్‌హగ్ కోహ్లీకి భుజం నొప్పి అన్నది ఉత్తుత్తిదేనని సంచలన వ్యాఖ్యలు ఆరోపణలు చేసి విమర్శల పాలైన సంగతి తెలిసిందే.

ఏప్రిల్‌లో జరిగే ఐపీఎల్‌లో పాల్గోనేందుకే స్ట్రేలియా జట్టుతో ధర్మశాలలో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌ను ఎగ్గొట్టారని అన్నాడు బ్రాడ్‌ హగ్‌. నిజంగా కోహ్లీ తీవ్ర గాయాలతోనే ఈ మ్యాచ్ కి దూరమైన మాట నిజమే అయితే, మరికొద్ది రోజుల్లో గుజరాత్ లయన్స్ టీమ్ తో జరిగే మ్యాచ్ లోనూ కోహ్లీ ఆడకూడదని హాగ్ అన్నాడు. టెస్టు మ్యాచ్ ని ఆడకుండా, ఆపై వారంలో జరిగే క్రికెట్ పోటీల్లో పాల్గొంటే, అది చాలా దరిద్రంగా ఉంటుందని అభివర్ణించాడు. ఎంతో విలువైన ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ ని గెలుచుకునేందుకు కోహ్లీ కృషి చేసి వుండాల్సిందని చెప్పాడు.

తాజాగా బ్రాడ్‌ హాగ్‌ క్షమాపణలు కోరాడు. ఒక క్రికెట్‌ ఆటగాడు మైదానంలోకి దిగితే ఎలా ఉంటుందో ఒక ప్రొఫెషనల్‌ ఆటగాడిగా తనకు తెలుసన్నాడు. అందుకే భారత క్రికెట్‌ అభిమానులకు, టీమిండియాకు, ప్రత్యేకంగా విరాట్‌ కోహ్లీకి క్షమాపణలు చెబుతున్నానని తెలిపాడు.

భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో తాను విఫలమయ్యానని… ఇందుకు తాను క్షమాపణలు చెబుతున్నానని స్మిత్ చెప్పిన సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్ లో ఓటమిపాలైన తర్వాత సిరీస్ అంతా గొడవలు, వివాదాలతోనే గడిచిపోయిందని స్మిత్ చెప్పాడు.

- Advertisement -