‘ఫాంథ‌మ్’ కోసం సిక్స్ ప్యాక్‌తో సూపర్‌స్టార్‌..

1097
sudeep
- Advertisement -

టాలీవుడ్‌లో ‘ఈగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ సూపర్‌ స్టార్‌ కిచ్చ సుదీప్ అందరికీ గుర్తుండే ఉంటాడు. ఈగ సినిమాతో ఎంత‌గానో అల‌రించిన సుదీప్ ఎన్నో తెలుగు చిత్రాలు చేశాడు. ఆ చిత్రాలు సుదీప్‌కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. అయితే ప్ర‌తి చిత్రంలోను నార్మ‌ల్‌గా క‌నిపించే సుదీప్ ఈ సారి మాత్రం త‌న కండ‌ల‌తో అంద‌రికి షాక్ ఇవ్వ‌నుండ‌డంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా సుదీప్‌ కండలు పెంచి ఫొటో తీసుకుని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. మంచి ఆహారం, జీవ‌న శైలి, జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేసి ఇలా మారిపోయానంటూ సుదీప్ తన ట్వీట్ లో తెలిపాడు.

ప్రస్తుతం సుదీప్‌ ‘ఫాంథ‌మ్’ అనే క‌న్న‌డ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసమే ఈ హీరో కండలు పెంచాడు. ఈ చిత్ర చివరి షెడ్యూల్ డిసెంబ‌ర్ 4న ప్రారంభం కానుంది. ఇందులో సుదీప్‌పై కీల‌క స‌న్నివేశాలను చిత్రీక‌రిస్తారు. ప్రస్తుతం సుదీప్‌ శరీర ఆకృతిని చూస్తోన్న నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -