ఆ విషయం చిరంజీవిని చూసి నేర్చుకున్నాః సుదీప్

311
Kicha sudeep Chiranjeevi
- Advertisement -

కన్నడ నటుడు సుదీప్ ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రంలో కూడా నటించాడు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సైరా సినిమాలో సుదీప్ కీలక పాత్రలో నటించారు. అలాగే సుదీప్ హీరోగా పహిల్వాన్ అనే సినిమా తెరకెక్కింది. ఈసినిమా ఇటివలే తెలుగు, కన్నడలో విడుదలైంది. కన్నడలో ఈమూవీ మంచి విజయం సాధించగా తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఈమూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుదీప్ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనకు స్టార్ డంపై నమ్మకం లేదని.. స్టార్ డం అనేది రిలేషన్షిప్ లాంటిదని.. ఈరోజు మనతో ఉంటుంది.. రేపు మరొకరితో ఉంటుందని అన్నారు. కానీ ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు.

చిరంజీవితో సైరా సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. చిరంజీవి నుంచి ఒక విషయం తాను నేర్చుకున్నానని చెప్పారు. రాజకీయాల్లోకి మాత్రం వెళ్లకూడదని అది చిరు సర్ నుండే నేర్చుకున్నట్లు తెలిపారు. గత పదేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉండి ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లడం ఇష్టం లేదన్నారు. తనను చాలా మంది రాజకీయాల్లోకి ఆహ్వానించారని కానీ తను వెళ్లలేదని అన్నారు. ఇండస్ట్రీలో కూడా రాజకీయాలు జరుగుతున్నాయని.. సినిమాకి మించిన రాజకీయాలు ఉండవని చెప్పారు.

- Advertisement -