భరత్ బ్యూటీ…బోల్డ్ స్టేట్‌మెంట్

329
kaira advani
- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ కైరా అద్వానీ. తెలుగు సినిమాలో నటించిన తొలి సినిమాకే బంపర్ హిట్‌ను అందుకుంది కైరా. ప్రస్తుతం రామ్‌ చరణ్‌తో సినిమా చేస్తున్న ఈ బ్యూటీ తెలుగుతో పాటు నార్త్ ప్రేక్షకులను అలరిస్తూ ముందుకుసాగుతోంది.

అయితే,తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది కైరా. పెళ్లికి ముందు సెక్స్ చేస్తే తప్పెంటి అని బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ ఫిల్మ్ లవ్‌ స్టోరీస్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

kaira advani

పెళ్లి అయ్యాక మాత్రమే సెక్స్ చేయాలని అంటారు కానీ నా దృష్టిలో అది తప్పు అని పేర్కొంది. అంతేగాదు తనకు సువాసన వచ్చే అబ్బాయిలు నచ్చుతారని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇటు తెలుగుతో పాటు హిందీలో కూడా పెద్ద సినిమా ఛాన్స్‌లను కొట్టేసిన ఈ బ్యూటీ బోల్డ్ స్టేట్‌మెంట్‌తో అందరి అటెన్షన్‌ను తనవైపు తిప్పుకుంది.

- Advertisement -